: 'సడక్ బంద్'పై నేడు నిర్ణయం తీసుకోనున్న ఐకాస
తెలంగాణపై కాంగ్రెస్ మాటమార్చిన నేపథ్యంలో తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్వహించ తలపెట్టిన 'సడక్ బంద్' కార్యక్రమంపై నేడు చర్చించనున్నారు. గతంలో నిర్వహించిన 'మిలియన్ మార్చ్' కార్యక్రమానికి నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా, 'మిలియన్ మార్చ్' స్ఫూర్తి సభను ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభ జరుగుతుంది. ఈ సభలో ఐకాస స్టీరింగ్ కమిటీ భేటీ అవనుంది. ఇందులో ప్రధానంగా.. 'సడక్ బంద్' కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించాలనే విషయంపైనా, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపైనా చర్చిస్తారు. 'సడక్ బంద్' ఇంతకుముందు రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.