: ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్


బాలీవుడ్ పాటల రచయిత జావెద్ అక్తర్ వెన్ను నొప్పి కారణంగా ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలంగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అయితే, కొన్ని రోజుల కిందట ఆరోగ్యం సహకరించనప్పటికీ ఢిల్లీలో ఓ సంగీత కచేరీకి హాజరైన అక్తర్, అదే సమయంలో తీవ్రమైన నొప్పికి గురయ్యారు. దాంతో, అక్కడి నుంచి తిరిగివచ్చిన వెంటనే భార్య షబానా అజ్మితో కలిసి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే జావెద్ ను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News