: పెండింగులో ఉన్న సర్వీస్ టాక్స్ చెల్లించాల్సిందేనన్న చిదంబరం
హైదరాబాదులో జరిగిన సేవా పన్ను అవగాహనా సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పాల్గొన్నారు. 2007 అక్టోబరు నుంచి 2012 డిసెంబరు వరకు పెండింగ్ లో ఉన్న సర్వీస్ టాక్స్ చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. బకాయి పడిన సేవా పన్నులో 50 శాతాన్ని ఈ నెలాఖరులోగా చెల్లించాలని, మిగిలిన 50 శాతాన్ని చెల్లించేందుకు వచ్చే ఏడాది జూన్ 30వ తేదీ వరకు గడువు తీసుకోవచ్చునని చిదంబరం చెప్పారు.