: న్యూస్ వీక్ ప్రింట్ ఎడిషన్ పునః ప్రారంభం
అమెరికాకు చెందిన న్యూస్ వీక్ తన ప్రింట్ ఎడిషన్ ను వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పునః ప్రారంభిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 64 పేజీలతో కూడిన వార పత్రికను పాఠకులకు అందిస్తున్నామని యాజమాన్యం వెల్లడించింది. వెబ్ ఎడిషన్ పై దృష్టి పెట్టిన ఈ పత్రిక గతేడాది ముద్రణను ఆపివేసింది. ఇప్పుడు మళ్లీ సరికొత్తగా చందాదారుల కోసం ముస్తాబవుతోందని, ప్రకటనలపై ఆధారపడకుండా కొనుగోలుదారులపైనే ఆధారపడి ముద్రణను కొనసాగించనున్నట్లు న్యూస్ వీక్ యాజమాన్యం పేర్కొంది.