: సమైక్యానికి కట్టుబడి ఉన్నా.. అసెంబ్లీలో మా వాణి వినిపిస్తా: జేపీ


తాను ఇప్పటికీ సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని... రానున్న శాసనసభ సమావేశాల్లో తమ వాణి వినిపిస్తామని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు... వలస పాలనను తలపిస్తోందని విమర్శించారు. ఈ రోజు ఏపీఎన్జీవోలు తనను కలిసిన అనంతరం జేపీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన నిర్ణయాలను కేంద్రంలో కాకుండా, రాష్ట్రంలోనే తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News