: పది జిల్లాల తెలంగాణే కావాలి: వీహెచ్
తెలంగాణ ప్రజలు రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. గతంలో సీడబ్ల్యూసీ తీర్మానించిన విధంగా పది జిల్లాలతో కూడిన తెలంగాణనే ఏర్పాటు చేయాలని అన్నారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.