: వాతావరణంలో మార్పులు.. దక్షిణ కోస్తాకు వర్ష సూచన
వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్రంలో కొన్నిచోట్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. ఓ మోస్తరు వర్షాలు పడతాయని సమాచారం. తమిళనాడుకు దగ్గరలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలుపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపారు.