: ఆసియా విద్యార్థులతో పోటీ పడలేకున్న అమెరికన్ చిన్నారులు
ఆసియా టీనేజర్లు తమ ప్రతిభతో అమెరికన్ విద్యార్థులను దాటుకుని ముందుకు దూసుకుపోతున్నారు. అంతర్జాతీయ విద్యార్థుల మదింపు కార్యక్రమం 2012లో భాగంగా నిర్వహించిన పరీక్షలో 65 దేశాల నుంచి 5లక్షల మంది విద్యార్థులు(15 ఏళ్ల వయసు) పాల్గొన్నారు. సైన్స్, మ్యాథ్స్, చదవడం తదితర అంశాల్లో టాప్ 20లో అమెరికన్ విద్యార్థి ఒక్కరూ నిలవలేదు. చైనాలోని షాంఘై అగ్రస్థానంలో నిలవగా.. సింగపూర్, దక్షిణ కొరియా, జపాన్, హాంగ్ కాంగ్ విద్యార్థులు జాబితాలో వరుసగా ఉన్నారు. మొదటి సారిగా ఈ పరీక్షలో పాల్గొన్న వియత్నాం విద్యార్థులు సైతం సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులలో అమెరికన్ విద్యార్థుల కంటే ముందుండడం విశేషం. అమెరికా విద్యా శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది.