: నటి సౌందర్య ఆస్తుల కేసులో రాజీకొచ్చిన కుటుంబ సభ్యులు
దివంగత సినీ నటీ సౌందర్య ఆస్తుల వివాదం కేసులో ఎట్టకేలకు కుటుంబ సభ్యులు రాజీకొచ్చారు. 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో సౌందర్య, ఆమె సోదరుడు అమర్ నాథ్ మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె తల్లి మంజుల, భర్త రఘు.. వదిన నిర్మల మధ్య ఆస్తుల విషయంలో గొడవలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సౌందర్య సోదరుడి భార్య నిర్మల 2009లో బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. అప్పటినుంచి సౌందర్య తల్లి మంజుల, భర్త రఘు కూడా పోరాడుతున్నారు. చివరికి నాలుగు సంవత్సరాల తర్వాత రాజీకొచ్చిన కుటుంబ సభ్యులు ఆస్తుల విషయంలో తమ మధ్య ఎలాంటి వివాదంలేదని కోర్టుకు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివాదపు అర్జీని కూడా ఉపసంహరించుకున్నారు. దాంతో, ఈ వివాదానికి పుల్ స్టాప్ పడింది.