: అమెరికాలో సింగ్ కు 50 వేల డాలర్ల పరిహారం


అమెరికాలో ప్రవాస భారతీయుడు గుర్ ప్రీత్ సింగ్ తనపై వివక్ష చూపిన కంపెనీపై కోర్టులో విజయం సాధించాడు. దీంతో 50 వేల డాలర్ల పరిహారం అతడికి లభించింది. 29 ఏళ్ల గురు ప్రీత్ ఒక కంపెనీ కారు సేల్స్ విభాగంలో ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. ఇంటర్వ్యూలో ఎన్నికై కంపెనీలో రెండు రోజుల శిక్షణను కూడా పూర్తి చేశాడు. అయితే గడ్డం తీసివేయాలంటూ కంపెనీ షరతు విధించింది. సిక్కు మత సంప్రదాయం ప్రకారం గడ్డం పెంచుకున్నానని చెప్పినా వినలేదు. గడ్డం తీయకపోతే ఉద్యోగం వదులుకోవాలని తేల్చి చెప్పింది. దీంతో గురుప్రీత్ న్యూయార్క్ ఫెడరల్ న్యాయస్థానంలో కేసు వేశాడు. దీన్ని విచారించిన న్యాయస్థానం మత సంప్రదాయాలను గౌరవించాలని యాజమాన్యానికి సూచించింది. అలాగే ఉద్యోగం నుంచి తొలగించినందుకు గాను 50 వేల డాలర్లు పరిహారం కింద చెల్లించాలని తీర్పు చెప్పింది.

  • Loading...

More Telugu News