: భారతరత్నకు ధ్యాన్ చంద్ పేరును కేంద్రం పరిశీలిస్తోంది: క్రీడా శాఖ మంత్రి


హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించకపోవడం పట్ల దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పురస్కారానికి ధ్యాన్ చంద్ పేరును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పంజాబ్ లోని సంగ్రుర్ సిటీలోని వార్ హీరోస్ స్టేడియంలో రూ. 6.87 కోట్లతో చేపట్టిన సింథటిక్ ట్రాక్ కు మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జితేంద్ర సింగ్ పైవిధంగా తెలిపారు.

  • Loading...

More Telugu News