: మారిషస్ జాతీయదినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రణబ్
మారిషస్ దేశ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. మారిషస్ డే మంగళవారం నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం మార్చి12ను మారిషస్ జాతీయదినంగా జరుపుకుంటారు.
మారిషస్ పర్యటన కోసం ప్రణబ్ రేపు బయల్దేరనున్నారు. ఆయన మారిషస్ లో మూడు రోజులు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ముఖ్యంగా ఆరోగ్య, పర్యాటక రంగాల్లో ఒప్పందాలపై చర్చించనున్నారు.