: బ్రిజేశ్ కుమార్ తీర్పు రాష్ట్రానికి తీరని ఆశనిపాతం: చంద్రబాబు


కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ వెలువరించిన తీర్పు ఆంధ్రప్రదేశ్ కు తీరని అశనిపాతమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. కృష్ణానదితో తెలుగువారికి విడదీయరాని అనుబంధం ఉందన్న ఆయన, కృష్ణా నదీ జలాల వివాదంపై ఇప్పటివరకు రెండు ట్రైబ్యునళ్లు ఏర్పాటయ్యాయన్నారు. అందులో బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు దారుణమని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద చేపట్టిన మహాధర్నాలో చంద్రబాబు ప్రసంగించారు. ట్రైబ్యునల్ తీర్పుతో పద్నాలుగు జిల్లాల ప్రజలకు రాబోయే రోజుల్లో తాగు, సాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదముందని చెప్పారు.

దిగువ ఉండే రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ట్రైబ్యునల్ చర్యలు తీసుకోలేదన్నారు. 75 శాతం నీటి లభ్యత ఆధారంగానే కొత్త ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతి ఇస్తుందని, బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ మాత్రం నీటి లభ్యతను 65 శాతానికి తగ్గించిందని విమర్శించారు. నాణ్యమైన ప్రాజెక్టులు నిర్మించి నీళ్లిచ్చిన ఘనత టీడీపీదేనని, గతంలో ఆల్మట్టి ఎత్తు పెంచడానికి ప్రయత్నిస్తే మాజీ ప్రధాని దేవగౌడతో పోరాడానని బాబు చెప్పారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో 303 టీఎంసీల కన్నా ఎక్కువ నీటిని కర్ణాటక నిల్వ చేసుకుంటుందని వివరించారు.

  • Loading...

More Telugu News