: హ్యాకింగ్ కి గురైన యూట్యూబ్
కోరుకున్న వీడియోను క్షణాల్లో కళ్లముందుకు తీసుకొచ్చే వెబ్ బ్రౌజర్ యూట్యూబ్ ఈ ఉదయం హ్యాకింగ్ కి గురైంది. డెస్క్ టాప్ ల నుంచి బ్రౌజ్ చేద్దామని ప్రయత్నించిన యూజర్లకు ఇంటర్నెట్ సర్వర్ ఎర్రర్ 500 అంటూ ఓ సందేశం దర్శనమిచ్చింది. ఎక్కడో తప్పు జరిగిందని, దాని కోసం శిక్షణ పొందిన కోతుల బృందాన్ని నియమించామని ఆ సందేశంలో ఉంది. తరువాత కాసేపటికి మళ్లీ యథాస్థితిలో యూట్యూబ్ పని చేసింది. హ్యాక్ కి గురైన సమయంలో కూడా యూట్యూబ్ మొబైల్స్ లో పని చేసింది. దీనిపై గూగుల్ స్పందిస్తూ తమ ఇంజనీర్లు పని చేస్తుండగా కాసేపు యూట్యూబ్ సర్వర్ స్లో అయిందని, దాని కారణంగా కోడ్ వచ్చిందని తెలిపింది. ఈ ఇబ్బందికి వినియోగదారులు క్షమించాలని కోరింది. ఇప్పుడు యూట్యూబ్ సరిగా పని చేస్తోందని స్పష్టం చేసింది.