: బిర్యానీ అడిగిన వారికి రాగి సంకటి పెట్టినట్టుంది: కేటీఆర్


రాయల తెలంగాణ ప్రతిపాదన, బిర్యానీ అడిగిన వారికి రాగి సంకటి పెట్టినట్టుందని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాకు హాజరైన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణకు ఇతర పార్టీల నాయకులు ఒప్పుకున్నా టీఆర్ఎస్ మాత్రం ఒప్పుకోదని స్పష్టం చేశారు. జైత్రయాత్రలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వీరంతా కేంద్ర కేబినెట్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి రాయల తెలంగాణ ప్రతిపాదనను పక్కన పెట్టించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఈ ప్రతిపాదనను లేవనెత్తిందని దుయ్యబట్టారు.

రాయల తెలంగాణకు వ్యతిరేకంగా రేపు బంద్ కు పిలుపునిచ్చామని కేటీఆర్ తెలిపారు. రాయల తెలంగాణ ఏర్పడితే, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు కూడా ఉండవని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News