: ఈ అర్థరాత్రికి శ్రీశైల మల్లికార్జునుడి కళ్యాణ మహోత్సవం


శ్రీశైల మల్లికార్జునుడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పలు ప్రత్యేక పూజలు అందుకొంటున్నశివపార్వతుల దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఉత్సవాల్లో భాగంగా నేడు 8వ రోజు కావడంతో శ్రీశైల క్షేత్రంలో ఈ సాయంత్రం 7 గంటలకు ఆది దంపతులను నందివాహనంపై ఊరేగిస్తారు.

అనంతరం మహాశివరాత్రి పురస్కరించుకొని రాత్రి 10.30 గంటలకు మల్లికార్జున స్వామికి ప్రత్యేక లింగోద్భవకాల మహారుద్రాభిషేకం జరగనుంది. చివరిగా రాత్రి 12 గంటలకు శివ పార్వతులకు కల్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇందుకోసం కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

  • Loading...

More Telugu News