: ధోనీ బ్యాట్ విలువ రూ. 25 కోట్లు
ఎంత ధోనీ అయితే మాత్రం, అతని బ్యాటు రూ. 25 కోట్లు ఉంటుందా... అనుకుంటున్నారా? ఇది నిజమేనండి బాబూ! ధనాధన్ ధోనీ బ్యాటుకు కార్పొరేట్ కంపెనీలు కట్టిన విలువ ఇది. తమ కంపెనీ లోగో స్టిక్కర్లను బ్యాట్ పై అతికించుకునేందుకు ధోనీకి ఆఫర్ చేసిన రేటు ఇది. వివరాల్లోకి వెళ్తే, తన బ్యాట్ ను స్పాన్సర్ చేసేందుకు స్పార్టన్ స్పోర్ట్, అమిటీ యూనివర్సిటీలతో టీమిండియా కెప్టెన్ ధోనీ రికార్డు స్థాయిలో రూ. 25 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం ధోనీ ఇకపై తన బ్యాట్లమీద స్పార్టన్, అమిటీ యూనివర్సిటీతో పాటు 7-ఎంఎస్ డీ అనే లోగోలను వేసుకోనున్నాడు.