: కాన్పూర్ ఐఐటీ విద్యార్థులకు రూ. 1.20కోట్ల వేతనం ఆఫర్


ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ ఐఐటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు 1.20కోట్ల రూపాయల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశం దక్కించుకున్నారు. ఒరాకిల్ సంస్థ వారికి ఈ ఆఫర్ ఇచ్చింది. ఈ ప్లేస్ మెంట్ కార్యక్రమం ఈ నెల 22 వరకు జరుగుతుందని ఐఐటీ వర్గాలు తెలిపాయి. 76 మంది రూ. 8లక్షల నుంచి రూ. 24లక్షల రూపాయల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇక ఐఐటీ ముంబై విద్యార్థులు ఐదుగురికి ఎంఈసీ జపాన్ కంపెనీ రూ. 30 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

  • Loading...

More Telugu News