: 'షోలే' త్రీడీ విడుదలపై పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు


బాలీవుడ్ హిట్ చిత్రం 'షోలే' త్రీడీ వెర్షన్ విడుదలపై స్టే ఇవ్వాలంటూ నిర్మాత రమేశ్ సిప్పీ పెట్టుకున్న పిటిషన్ ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు చిత్రం విడుదలకు కోర్టు అనుమతించింది. 1970లలో 'షోలే' చిత్రాన్ని తన దర్శకత్వంలో రమేశ్ సిప్పీ తెరకెక్కించారు. ఇన్నేళ్ల తర్వాత ఆ చిత్రాన్ని సిప్పీ సోదరుడి కుమారుడైన షాషా త్రీడీ వెర్షన్ లో తీసుకొచ్చారు. ఇందుకు నిరాకరిస్తున్న సిప్పీ.. కాపీరైట్ వివాదం నేపథ్యంలో సోదరుడి కుమారుడి చిత్రంపై న్యాయస్థానానికి వెళ్లారు.

  • Loading...

More Telugu News