: ఈ రోజు సాయంత్రం 8 గంటలకు జీవోఎం ఫైనల్స్
నిన్నటి జీవోఎం మీటింగ్ తరువాత రాష్ట్ర విభజనపై కీలక నిర్ణయం వెలువడుతుందన్న వూహాగానాలకు తెరదించుతూ... మీటింగ్ అనంతరం మరో భేటీ అవసరమంటూ కేంద్ర హోంమంత్రి షిండే వెళ్లిపోయారు. నిన్న జరిగిన జీవోఎం సమావేశానికి సభ్యులందరూ హాజరవడంతో, 11 విధివిధానాలపై సిఫారసులు, ముసాయిదా బిల్లు ఖరారవుతుందని అందరూ భావించారు. దీంతో ఈ రోజు రాత్రి 8 గంటలకు జీవోఎం భేటీ మరోసారి జరగనుంది. ఇప్పటికే దాదాపు అన్ని అంశాలపై జీవోఎం ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాయల తెలంగాణను బిల్లులో పొందుపరిచినట్టు షిండేను కలిసి వచ్చిన అనంతరం ఓ సీమాంధ్ర కేంద్ర మంత్రి చెప్పారు. అంతే కాకుండా హైదరాబాద్ పై గవర్నర్ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.