: గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు


బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పును నిరసిస్తూ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద ధర్నా చేపట్టనున్నారు. దీనికోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన కొద్దిసేపటి క్రితం విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ తీవ్రంగా నష్టపోనున్నాయని తెదేపా ఆందోళనకు సిద్ధమైంది. ఈ ధర్నాలో కృష్ణా డెల్టా పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, ఖమ్మం, నల్గొండ జిల్లాల రైతులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని తెదేపా పిలుపునిచ్చింది. మరికాసేపట్లో ఈ ధర్నా ప్రారంభంకానుంది.

  • Loading...

More Telugu News