: కుంభమేళాకు నేడు చివరిరోజు
గత 55 రోజులుగా సాగుతున్న మహాకుంభమేళా నేడు చివరి అంకానికి చేరుకుంది. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ త్రివేణి సంగమంలో సంక్రాంతి రోజున ప్రారంభమైన ఈ పవిత్ర మేళా నేటి మహాశివరాత్రితో ముగియనుంది.
దీంతో, చివరి రోజున పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగిన పలువురు మరణించిన నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.