: భక్తులతో కిటకిటలాడుతున్న కోటప్పకొండ
గుంటూరు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతున్న కోటప్పకొండ నేడు భక్తులతో కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడి త్రికూటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తజనం పోటెత్తారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కోటప్పకొండకు భక్తులు తరలివస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.