: అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలి: జయప్రద


అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాలని ప్రముఖ సినీ నటి, లోక్ సభ ఎంపీ జయప్రద అభిప్రాయపడ్డారు. సినిమా నిర్మాణ పనుల్లో భాగంగా గోవా వచ్చిన సందర్భంగా, పనాజీలో తెహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ లైంగిక వేధింపుల కేసుపై మాట్లాడుతూ, అత్యాచారానికి పాల్పడ్డవారికి ఉరిశిక్షే సరైన శిక్షగా పేర్కొన్నారు. అది కాకుంటే జీవిత ఖైదు అయినా విధించాలని సూచించారు. అవినీతి కంటే నేరాలే ప్రమాదకరమని ఆమె అన్నారు.

ఉత్తరప్రదేశ్ లో పెరుగుతున్న నేరాలపై ములాయంసింగ్ సారధ్యంలోని అధికార పార్టీ ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తాజాగా చోటు చేసుకుంటున్న ఘటనలతో అక్కడి పిల్లలు, మహిళలు భయబ్రాంతులకు గురవుతున్నారని వెల్లడించారు. ముంబై, కోల్ కతా వంటి మెట్రోపాలిటన్ నగరాలతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నేరాలపై ప్రజలు ఉద్యమించాల్సిన పరిస్థితి ఉందని జయప్రద అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News