: ట్రైబ్యునల్ తీర్పుకు నిరసనగా రేపు, ఎల్లుండి విజయమ్మ దీక్షలు
కృష్ణానదీ జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు నిరసనగా వైఎస్ విజయమ్మ రేపు, ఎల్లుండి దీక్షలు చేపట్టనున్నారు. రేపు పులిచింతల ప్రాజెక్ట్ వద్ద విజయమ్మ దీక్ష చేయనున్నారని వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. ఈ దీక్షకు కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు భారీగా తరలి వస్తారని ఆయన చెప్పారు. గురువారం వైఎస్ఆర్ జిల్లాలోని గండికోట ప్రాజెక్ట్ సమీపంలో విజయమ్మ దీక్ష చేపట్టనున్నట్లు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు.