: డిసెంబర్ 9వ తేదీని జాతి విద్రోహ దినంగా జరుపుతాం: అశోక్ బాబు


అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వచ్చిన వెంటనే అసెంబ్లీని ముట్టడిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఆ రోజు హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్ర వాసులందరూ అసెంబ్లీని ముట్టడించాలని పిలుపు నిచ్చారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదో తేదీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ సారి సుదీర్ఘమైన ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. డిసెంబర్ 9వ తేదీని జాతి విద్రోహదినంగా అన్ని జిల్లాల్లో జరుపుతామని తెలిపారు. సమ్మెకు సమాయత్తం కావడానికి ఈ నెల 7వ తేదీన అన్ని సంఘాలతో సమావేశం అవుతామని వెల్లడించారు. మళ్లీ ఢిల్లీ వెళ్లి తెలంగాణ బిల్లు వ్యతిరేకించాలని జాతీయ పార్టీలను కోరతామని అశోక్ బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News