: శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలి: సుష్మా స్వరాజ్
రానున్న శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో పాటు, లోక్ పాల్ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని ఆమె కోరారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో 2జీ కుంభకోణం, ధరల పెరుగుదల తదితర అంశాలను లేవనెత్తుతామని అన్నారు.