: మాజీ ఎంపీ గిరీష్ సంఘీపై నిర్భయ కేసు


ఓ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ ఎంపీ గిరీష్ సంఘీపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. ఆయనతో సహా మొత్తం 25 మందిపై హైదరాబాదులో ఈ కేసు నమోదైంది. నగరంలోని కంటోన్మెంట్ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేతను నిరసిస్తూ గిరిష్ సంఘీ నేతృత్వంలో గత నెల 21న ర్యాలీ, సభ నిర్వహించారు. ఈ సభలో కంటోన్మెంట్ సీఈవో సుజాత అనే మహిళపై ర్యాలీలో పాల్గొన్న కొంతమంది అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దానిపై ఆమె వెంటనే బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు. మరోవైపు గిరీష్ సంఘీ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేశారు.

  • Loading...

More Telugu News