: జైపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని హెచ్చరించాలి: విద్యాసాగర్ రావు


రాయల తెలంగాణ అంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేత విద్యాసాగర్ రావు నల్గొండలో మాట్లాడుతూ, రాయల తెలంగాణను అడ్డుకోవాలంటే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తీవ్రంగా హెచ్చరించాలని సూచించారు. సమయం సరిపడినంత లేదన్న విద్యాసాగర్ రావు, తక్షణం స్పందించకపోతే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. బీజేపీ పది జిల్లాల తెలంగాణకు మాత్రమే మద్దతిస్తోందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News