: ఫేస్ బుక్ లో రాతలు చెప్తాయి.. ఎవరేంటో
ఫేస్ బుక్ లో పోస్టింగులు చూసి ఎవరెలాంటి వారో చెప్పేయవచ్చంటున్నారు పరిశోధకులు. స్వీడన్ కు చెందిన సాహ్ గ్రెన్ స్కా అకాడమీ, లండ్ యూనివర్సిటీ పరిశోధకులు ఇదే విషయమై ఒక అధ్యయనం చేశారు. 300 మంది అమెరికన్ల ఫేస్ బుక్ స్టాటస్ లను విశ్లేషించి చూశారు. వాళ్లు వాడిన పదాలు, భాష ఆధారంగా మానసిక రోగులా? లేక సామాజిక జీవులా? అన్నది తేల్చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న సైకాలజీ ప్రొఫెసర్ సిక్స్ స్ట్రామ్ మాట్లాడుతూ.. చెడ్డ మనస్తత్వం ఉన్నవాళ్లు వ్యభిచారిణులు, పోర్నోగ్రఫీ, కసాయివాళ్లు వంటి విషయాలతో కూడిన పోస్టింగులు చేస్తూ ఉంటారని తెలిపారు.