: సురవరంతో టీజాక్ నేతల భేటీ
సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో తెలంగాణ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇచ్చేలా చూడాలని జేఏసీ నేతలు సుధాకర్ రెడ్డిని కోరారు. సీపీఐ పది జిల్లాలతో కూడిన తెలంగాణకు కట్టుబడి ఉందని సురవరం సుధాకర్ రెడ్డి వారికి హామీ ఇచ్చినట్టు సమాచారం.