: పెళ్లికి ముందు శృంగారం తప్పనిసరి: షెర్లిన్ చోప్రా
బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా శృంగారం విషయంలో సంచలనరీతిలో స్పందించింది. వివాహ బంధంలానే సహజీవనం కూడా పవిత్రమైనదేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. పైగా పెళ్లికి ముందు శృంగారం తప్పనిసరి అని కూడా చెప్పింది. ప్రేమంటే నిజమైన స్నేహం, తోడు నీడ అంటూనే.. జీవిత భాగస్వామి మోసం చేస్తే క్షమిస్తాను అని విశాల హృదయం చాటుకుంది.