: రాజకీయాలంటే ఇష్టమేనంటున్న రాష్ట్రపతి కూతురు శర్మిష్ఠ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ చురుగ్గా పాల్గొన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో శర్మిష్ఠ బరిలోకి దిగే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ విషయమై అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికర సమాధానాలిచ్చారు. తమది రాజకీయ కుటుంబమని, రాజకీయాలంటే తనకు ఇష్టమేనని, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం తన కర్తవ్యంగా భావించానని శర్మిష్ఠ చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా...అని అడిగితే, ఎన్నికల్లో పోటీ కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు.