: వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు దేనికి?: కవిత
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు తెలంగాణాకా? సమైక్యాంధ్రాకా ? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సూటిగా ప్రశ్నించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు, అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెడితే మద్దతిస్తారా? లేదా? అని చెప్పాలని డిమాండ్ చేసారు.
జగన్ అధికారంలోకి వస్తే వైఎస్ కుటుంబానికే ప్రయోజనమనీ, తెలంగాణకు కాదనీ అన్నారు. హైదరాబాదులో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ తన స్పష్టమైన విధానాన్ని తెలపాలని డిమాండు చేశారు. పాదయాత్ర మొదలుపెట్టే ముందు తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను షర్మిల గౌరవించాలని కవిత సూచించారు.