: కరిష్మ మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తోందట!
పెళ్లయి పిల్లలతో కాలక్షేపం చేస్తోన్న కరిష్మాకపూర్ మళ్లీ సినిమాల్లో తెగ నటించేయాలని నిరీక్షిస్తోంది. మంచి స్క్రిప్ట్ తో రండి బాబులూ అని ఆహ్వానిస్తోంది. పెళ్లి.. పిల్లల విరామం తర్వాత 'డేంజరస్ ఇష్క్' సినిమాలో అవకాశం వచ్చినా కరిష్మ సత్తా చూపలేకపోయింది. దీంతో ఆమెను అవకాశాలు కూడా పలకరించడం లేదు. అంతే, ఆ దెబ్బకు నటనను ప్రేమిస్తే.. అన్ని వేళలూ అనువైనవేనంటూ వేదాంతం కూడా మాట్లాడుతోంది.