: పది జిల్లాల తెలంగాణ అయితే సమస్య ఉండదు: సీపీఐ నారాయణ
పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తే ఏ సమస్యా రాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాయల తెలంగాణపై స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని ఇష్టానుసారం చీల్చితే అనేక పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాయల తెలంగాణ అనకుండా, పది జిల్లాల తెలంగాణ ఆమోదిస్తే బాగుంటుందని సూచించారు. అలా కాకుండా అతితెలివికి పోయి రాయల తెలంగాణ అన్నా, తప్పించుకోవాలని చూసినా రాజకీయ సంక్షోభం వచ్చి, ఊహించని రీతిలో ఆందోళనలు చెలరేగే అవకాశం ఉంటుందని నారాయణ హెచ్చరించారు.