: 'రాయల టీ'పై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి
రాయల తెలంగాణపై తెరాస అధినేత కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఈ సాయంత్రం జరగనున్న జీవోఎం సమావేశంలో రాయల తెలంగాణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే... దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. దీనికి సంబంధించి, అందుబాటులో ఉన్న సీనియర్ టీఆర్ఎస్ నేతలతో ఈ సాయంత్రం సమావేశం నిర్వహించి, కార్యాచరణను రూపొందించాలని కేసీఆర్ భావిస్తున్నారు.