: ఖైదీ రోగుల ప్రవర్తన తీవ్రంగా ఉంటుంది: ప్రమోద్ కుమార్
ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఉన్న ఖైదీ రోగుల ప్రవర్తన ఇతర మానసిక రోగుల కంటే భిన్నంగా, విపరీతంగా ఉంటుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రమోద్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాల వద్ద ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రి నుంచి పరారైన ఖైదీ రోగుల వల్ల బయటి వ్యక్తులకు ప్రమాదం ఉండొచ్చని హెచ్చరించారు. ఆసుపత్రిలో ఉండే మానసిక రోగుల భద్రతను తాము పర్యవేక్షిస్తామని, అయితే ఖైదీ రోగుల భద్రత మాత్రం పోలీసులదేనని ఆయన స్పష్టం చేశారు.