: కాలేజ్ బిల్డింగ్ పైనున్న సెల్ టవర్ లో మంటలు


హైదరాబాద్ చంపాపేటలోని ఓ కాలేజ్ భవనంపై ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. సెల్ టవర్ కింద భాగంలోని జనరేటర్ లో మంటలు చెలరేగాయి. ఈ సందర్భంగా, దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఘటన జరిగిన సమయంలో కళాశాలలో విద్యార్థులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

  • Loading...

More Telugu News