: ఇక విదర్భ రాష్ట్రం కోసం ఉద్యమించనున్న బీజేపీ
ఒకవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంటున్న తరుణంలో.. మరోవైపు మహారాష్ట్ర నుంచి విదర్భ ప్రాంతాన్ని వేరు చేస్తూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంపై బీజేపీ తుది ఉద్యమానికి సిద్ధమవుతోంది. విదర్భ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను కాంగ్రెస్ ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫద్నావిస్ అన్నారు. విదర్భను ఏర్పాటు చేస్తే అధికారం ఎన్ సీపీ చేతికి వెళుతుందని కాంగ్రెస్ భయపడుతోందని చెప్పారు. తమ డిమాండ్ ను పరిశీలించకుంటే ప్రజాస్వామ్య విధానంలో పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ హింసను మాత్రమే అర్థం చేసుకోగలదన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన హింసాత్మక నిరసనలను ఉదాహరణగా పేర్కొన్నారు.