: ఇదే ఆఖరి ప్రయత్నం: చిరంజీవి
రాష్ట్ర విభజన అంశం తుది దశకు చేరుకోవడంతో కేంద్ర మంత్రి చిరంజీవి తన చివరి ప్రయత్నాలను కొనసాగించారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రులు, జీవోఎం సభ్యులైన షిండే, జైరాం రమేష్ లను కేంద్ర మంత్రి చిరంజీవి కలిశారు. ఈ భేటీలో ఆయన ప్రధానంగా యూటీపైనే చర్చించారని సమాచారం. రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ ను శాశ్వత యూటీ చేయాలని చిరంజీవి డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం చిరు స్పందనను కోరిన మీడియాకు, ఇదే ఆఖరి ప్రయత్నం అని మాత్రమే చెప్పారు.