: చందమామను దాటిన మామ్
అరుణ గ్రహంపై అన్వేషణకు బయల్దేరిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) చంద్రుని కక్ష్యను కూడా దాటేసింది. మామ్ ను భూ కక్ష్య ఆవలకు ప్రవేశపెట్టే పనిని శాస్త్రవేత్తలు శనివారం అర్ధరాత్రి పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజుల్లోనే మామ్ చందమామ కక్ష్యను కూడా దాటి అరుణుడి దిశగా పయనిస్తోంది. మామ్ రోజుకు 10 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోందని ఇస్రో వర్గాలు తెలిపాయి. బెంగళూరులోని ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు మామ్ ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.