: రాయలసీమను ముక్కలు చేసేందుకు సోనియా కుట్ర: వైకాపా నేత పెద్దిరెడ్డి


ఎంతో చరిత్ర కలిగిన రాయలసీమను రెండు ముక్కలు చేసి లబ్ది పొందాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారని వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రభంజనాన్ని తగ్గించాలనే పన్నాగంతోనే, సోనియా ఈ కుట్రకు తెరతీశారని విమర్శించారు. అందుకే కాంగ్రెస్ అధిష్ఠానం రాయల తెలంగాణ అంటూ యూటర్న్ తీసుకుందని ఎద్దేవా చేశారు. తాను సమైక్యవాదినంటూ గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కిరణ్, రాయల తెలంగాణపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సోనియా, కిరణ్, చంద్రబాబులు ఎన్ని కుట్రలకు పాల్పడినా, జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని అన్నారు.

  • Loading...

More Telugu News