: పశ్చిమ గోదావరి జిల్లాలో బాబుకు ఘనస్వాగతం
కృష్ణా జిల్లాలో పాదయాత్ర ముగించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం లభించింది. ఆకివీడు మండలం ఉప్పుటేరు వద్ద పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఎదురేగారు.
ఈ సందర్బంగా బాబు మాట్లాడుతూ, కొల్లేరును ధ్వంసం చేసిన ఘనత వైఎస్ దే అని చెప్పారు. ఇక తాము అధికారంలోకి వస్తే తొలి సంతకాన్ని వ్యయసాయ రుణమాఫీపై చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు తెదేపా కట్టుబడి ఉందని, మాదిగ ఉపకులాలకు న్యాయం చేసే బాధ్యత టీడీపీదేనని బాబు అన్నారు.