: విద్యుత్ ఛార్జీల పెంపుపై నేడు డిస్కంల ప్రతిపాదనలు
విద్యుత్ ఛార్జీల పెంపుపై నేడు ఈఆర్ సీకి విద్యుత్ డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించనున్నాయి. ఈ మేరకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి, వినియోగదారులపై ఐదువేల కోట్ల భారం మోపేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేశాయి. దాంతో, డిస్కంల ప్రతిపాదనలపై జనవరిలో ఈఆర్ సీ బహిరంగ విచారణ చేపడుతుంది. అనంతరం ఏప్రిల్ ఒకటి నుంచి డిస్కంలు కొత్త విద్యుత్ ఛార్జీలు వసూలు చేయనున్నాయి.