: ఈ వాచ్‌తో మీ పిల్లలు భద్రం!


ఇప్పుడు ఎక్కడ చూసినా పిల్లల దొంగలు ఎక్కువైపోతున్నారు. దీంతో పిల్లల్ని బయటికి పంపిన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేదాకా భయంభయంగా ఉంటారు. ఇలాంటి నేరాలకు చెక్‌ పెట్టడానికి ఒక సరికొత్త వాచ్‌ను పరిశోధకులు రూపొందించారు. ఈ వాచ్‌ను మీ పిల్లలు ధరించిన తర్వాత వారు ఎక్కడున్నారు? అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుంటుంది. దీంతో పిల్లలు భద్రంగా ఉన్నారనే భరోసా కూడా తల్లిదండ్రులకు ఉంటుందని చెబుతున్నారు.

అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఒక సరికొత్త స్మార్ట్‌ వాచ్‌ను తయారుచేశారు. ఈ వాచ్‌ జీపీఎస్‌ ఆధారిత గడియారం 'ఫిలిప్‌' అనే ఒక యాప్‌ ద్వారా వారి తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్లకు అనుసంధానమై ఉంటుంది. అయితే ఇందులో మీ పిల్లలు సాధారణంగా ఎక్కువ సమయాన్ని గడిపే ఇల్లు, పాఠశాలలు మొదలైన ప్రాంతాలను సేఫ్‌జోన్లుగా నిక్షిప్తం చేసుకోవాలి, మీ స్మార్ట్‌ ఫోన్లలో కూడా స్టోర్‌ చేసుకోవాలి. ఆ సేఫ్‌జోన్‌నుండి పిల్లలు బయటకు వెళ్లిన మరుక్షణం తల్లిదండ్రుల స్మార్ట్‌ ఫోన్‌కు ఆ సమాచారం తెలిసిపోతుంది. వెంటనే వారు ఆ పిల్లలకు ఫోన్‌ చేయడం లేదా వారికి మెసేజ్‌ పంపడం చేయవచ్చు.

అలాగే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాచ్‌లోని రెడ్‌ బటన్‌ను పిల్లలు నొక్కిపట్టుకుంటే తక్షణమే వాచ్‌నుండి వారి సంబంధీకులకు ఫోన్‌ వెళుతుంది. దీంతో వారు ఎక్కడున్నారు అనే సమాచారం కూడా తెలుస్తుంది. ఇందులో ఐదుగురి నంబర్లను ఫీడ్‌ చేయవచ్చు. ఈ వాచ్‌తో మీ పిల్లలు ఎక్కడున్నారు? అనే విషయాన్ని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News