: ఈ బ్యాండ్‌ నిజంగా ఫ్రెండే


మన ఫ్రెండ్స్‌ మన చేతికి ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్‌ కడతారు. వాటిని చూసినప్పుడు మన స్నేహితులు మనకు గుర్తుకొస్తారు. అయితే అదే బ్యాండ్‌ మన ఆరోగ్యాన్ని గురించి కూడా శ్రద్ధ తీసుకునే లాంటిదైతే ఇక అలాంటి బ్యాండ్‌ కట్టిన ఫ్రెండు నిజమైన ఫ్రెండు, ఆ బ్యాండు కూడా మనకు ఫ్రెండేకదా. సూర్యరశ్మి ద్వారా మన శరీరానికి డి విటమిన్ లభిస్తుంది. కానీ అదే సూర్యరశ్మి ద్వారా సోకే అతినీల లోహిత కిరణాలవల్ల మనకు స్కిన్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే పరిశోధకులు ఒక సరికొత్త బ్యాండ్‌ను తయారుచేశారు. ఈ బ్యాండ్‌ సూర్యరశ్మి తీవ్రత పెరిగితే చక్కగా దాన్ని ధరించిన వారిని అప్రమత్తం చేస్తుందట.

యూవీఏప్లస్‌బీ సన్‌ఫ్రెండ్‌ పేరుతో అమెరికా పరిశోధకులు ఒక సరికొత్త బ్యాండ్‌ను తయారుచేశారు. ఈ బ్యాండ్‌ సూర్యరశ్మిలో తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు తెలియజేస్తుంది. సూర్యుడి కిరణాల్లో ఏమాత్రం తీవ్రత పెరిగినా దాన్ని ధరించినవారిని అప్రమత్తం చేస్తుందట. అంతేకాదు ఈ బ్యాండ్‌ను ధరించినవారు ప్రత్యేకంగా సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాల్సిన పనిలేదట. మన శరీరానికి ఎంత డి విటమిన్‌ కావాలి?, సూర్యరశ్మి తీవ్రత పెరగడం వల్ల స్కిన్‌ కేన్సర్‌కు గురయ్యే అవకాశాల గురించి ఒకేసారి తెలియజేయడం ఈ సన్‌ ఫ్రెండ్‌ ప్రత్యేకత అని దీన్ని తయారుచేసిన షాహిద్‌ అస్లామ్‌, కరీన్‌ ఎడ్జెట్‌ చెబుతున్నారు.

అయితే దీన్ని ధరించే వ్యక్తి ముందుగా తన స్కిన్‌ టోన్‌, సెన్సిటివిటీని ఈ పరికరంలో నిక్షిప్తం చేయాలట. ఈ వాటర్‌ఫ్రూఫ్‌ రిస్ట్‌బ్యాండ్‌కు పేటెంట్‌ కూడా ఉంది. సన్‌ఫ్రెండ్‌లో నాసా రూపొందించిన అల్ట్రా వయొలెట్‌ సెన్సార్లు, ఎల్‌ఈడీ ఇండికేటర్లు ఏర్పాటు చేశారు. అతినీలలోహిత కిరణాలు ప్రమాద స్థాయిని దాటితే వెంటనే ఇందులోని ఎల్‌ఈడీ లైట్లు వెలిగి దాన్ని ధరించిన వ్యక్తిని అప్రమత్తం చేస్తాయట.

  • Loading...

More Telugu News