: గొంతు క్యాన్సర్‌ కారక జీన్స్‌ ఆచూకీ తెలిసింది


గొంతు క్యాన్సర్‌ కు దారితీస్తున్న నిర్దిష్టమైన కొత్తరకం జీన్స్‌ను భారతీయ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. మనదేశంలో ఇది ప్రధానంగా పొగతాగే రూపంలో కాకుండా, పొగాకు వినియోగించే వారిలో ఎక్కువగా వస్తుందని తేలుతోంది. అయితే ఈ దిశగా మరిన్ని పరిశోధనలు చేసినట్లయితే గొంతు క్యాన్సర్‌ను నియంత్రించే దిశగా.. మెరుగైన వైద్యవిధానాల్ని అభివృద్ధి చేయడం సాధ్యం అవుతుందని... శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరి పరిశోధన ఫలితాలను నేచర్‌ కమ్యూనికేషన్స్‌ పత్రికలో ప్రచురించారు.

2009లో ప్రారంభం అయిన అంతర్జాతీయ క్యాన్సర్‌ జీనోం కన్సార్టియం లో ఈ భారతీయ బృందం కూడా ఒక భాగం. 50 రకాల వివిధ క్యాన్సర్ల జీనోమిక్‌ ఆధారాలను కనుగొనడం లక్ష్యంగా వీరు పరిశోధనలు చేశారు. భారతీయ విభాగం, పశ్చిమబెంగాల్‌లోని జాతీయ బయోమెడికల్‌ జీనామిక్స్‌ సంస్థ, ముంబయిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌ ల ఆధ్వర్యంలో జరిగాయి. భారతీయ ప్రాజెక్టులో కనుగొన్న తొలి విషయం ఇదే. అయినప్పటికీ క్యాన్సర్‌ జీనోమిక్స్‌కు ఇది చాలా కీలకం అని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News