: ఆటిజం పిల్లలకు ఆక్యుపేషనల్‌ థెరపీ ఉత్తమం


ఆటిజం వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఆక్యుపేషనల్‌ థెరపీ ఎంతో ఉపకరిస్తుందని డాక్టర్లు నిర్ధారిస్తున్నారు. స్వబుద్ధితో జ్ఞాపకంతో చేయాల్సిన దైనందిన పనులను అంటే తినడం, బట్టలేసుకోవడం, నేర్చుకోవడం, ఆడుకోవడం ఇలాంటి విషయాల్లో కాస్త విలక్షణంగా ప్రవర్తించడం అనేది ఆటిజంతో కూడిన పిల్లల్లో ఉంటుంది.

ప్రస్తుతం ఈ ఆటిజం లక్షణాలను తగ్గించడానికి బిహేవియరల్‌ శిక్షణను ఇస్తుంటారు. ఇది సజావుగానే పనిచేస్తుందిగానీ.. వారానికి 25 నుంచి 40 గంటల వంతున రెండు సంవత్సరాల పాటూ శిక్షణ అందించాల్సి ఉంటుంది.. కొందరు తల్లిదండ్రులు కోరే ప్రకారం.. సెన్సారీ ఇంటిగ్రేషన్‌ వ్యూహాలను అనుసరిస్తూ న్యూరో సైంటిస్టు రోషియాన్‌ స్కాఫ్‌ తన సహచరులతో కలిసి ప్రయోగాలు నిర్వహించారు.

ఉదాహరణకు పిల్లలు షవర్‌ చేయడం లేదు అని తల్లిదండ్రులు ఫిర్యాదుచేస్తే.. సాధారణ థెరపిస్టులు పిల్లవాడికి షవర్‌ ఎలా అలవాటు చేయాలని అని ఆలోచిస్తారు. అతని పనిని సెన్సారీ ఫ్యాక్టర్స్‌ ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనిస్తారు. అయితే ఆక్యుపేషనల్‌ థెరపీలో ముందు షవర్‌ను పిల్లవాడు ఎంత మేర భరించగలుగుతున్నాడు? అనేది తెలుసుకోవడం దగ్గరినుంచి చికిత్స మొదలవుతుంది. ఇలాంటి ఆక్యుపేషనల్‌ థెరపీలు ఆటిజం వ్యాధితో బాధపడుతున్న పిల్లలను సాధారణ స్థితికి తీసుకురావడంలో మెరుగ్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News