: రాయల తెలంగాణ కుట్రపూరిత ప్రతిపాదన: టీజేఏసీ
ఢిల్లీలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో తెలంగాణ జేఏసీ నేతల భేటీ ముగిసింది. అనంతరం టీజేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. పది జిల్లాలతో కూడిన తెలంగాణే తమకు అంగీకారమని పేర్కొన్నారు. రాయల తెలంగాణ అనేది కుట్రపూరిత ప్రతిపాదన అన్న టీజేఏసీ, అది రెండు ప్రాంతాలకు అంగీకారం కాదన్నారు. తెలంగాణ అనేది కేవలం భౌగోళిక అంశం కాదన్నారు. తెలంగాణకు మద్దతివ్వాలని రేపు శరద్ యాదవ్, సురవరంలను కలిసి కోరతామని కోదండరాం తెలిపారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇప్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలదేనని సూచించారు.